కృష్ణ, జయప్రద నటించిన,1980 లో వచ్చిన "అల్లరి బావ" సినిమాలో "మధువని లో రాధికవో" ఒక మంచి సుమధుర గీతం.. రాజన్-నాగేంద్ర మెలోడీ.
చిత్రం: అల్లరి బావ (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణం: కృష్ణ, జయప్రద
దర్శకత్వం: పి. సాంబశివ రావు
పల్లవి :
మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...
॥
చరణం : 1
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో...
॥
చరణం : 2
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో...
చిత్రం: అల్లరి బావ (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణం: కృష్ణ, జయప్రద
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సినిమా ఇక్కడ చూడండి :
పల్లవి :
మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...
॥
చరణం : 1
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో...
॥
చరణం : 2
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో...


No comments:
Post a Comment