Friday, May 8, 2020

కెప్టెన్ కృష్ణ (1979) - కల కాలం ఇలా సాగనీ

కృష్ణ, కవిత, నటించిన కెప్టెన్ కృష్ణ సినిమా 1979లో విడుదల అయ్యింది.
ఇది తెలుగు సినీ ప్రపంచం లో మొట్ట మొదటి నీటి లోపల తీసిన సినిమా.


ఇందులో 'కల కాలం ఇలా సాగనీ'  పాట మంచి మెలోడీ. కానీ ఇది వింటుంటే ఎదో హిందీ పాట గుర్తుకు వస్తోంది..


చిత్రం: కెప్టెన్ కృష్ణ (1979)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణంకృష్ణ, శారదా, శ్రీప్రియా, కవిత 


పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 1:

నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివశించనీ...
నీ నయనాలలో నను నివశించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 2:

జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...
నీడల్లె నీ వెంట నేనుండగా...బ్రతుకంత నీతోనే పయణించగా...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 3:

ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము...
ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము..
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...
వెలగాలి కోటి చందమామలై....

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో... నన్నే చూడనీ...

No comments:

Post a Comment