నాకు తెల్సినవి, అందరితో పంచుకోవాలని.. సర్వే జన శుఖినోభవంతు
Saturday, September 16, 2017
శ్రీవారు మావారు(1973) - పోలేవులే నీవు పోలేవులే
కృష్ణ, వాణిశ్రీ నటించిన 'శ్రీవారు మావారు' (1973) సినిమా లో పాటలు బాగుంటాయి.
ముందు పోస్ట్ లో ఒక మంచి పాట విన్నారు కదా.. ఇప్పుడు ఇంకో మంచి యుగళ గీతం విందాం
వాటిలో 'పోలేవులే నీవు పోలేవులే' అనే మంచి పాట విని ఆనందించండి.
సినిమా: శ్రీవారు మావారు (1973)
సంగీతం: జి.కే. వెంకటేష్
రచన: దాశరథి
దర్సకత్వం: బి.స్. నారాయణ
తారాగణం: కృష్ణ, వాణిశ్రీ, నాగభూషణం, గీతాంజలి
గానం: బాలు,సుశీల
పల్లవి :
పోలేవులే.. నీవు పోలేవులే
పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా
చరణం 1 :
మొదటి చూపులోనే మైమరిచాను.. కనులు కలవగానే కలగన్నాను
మొదటి చూపులోనే మైమరిచాను...కనులు కలవగానే కలగన్నాను
ఎన్ని జన్మల ఈ ప్రేమబంధమో... నే నిన్ను వీడి ఉండలేనులే
రా ప్రియా... నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే
చరణం 2 :
మొదటి చూపులోనే మురిసిన నీవు... చెంత చేరగానే పొమ్మన్నావు అమ్మగారి మాట నమ్మేదెట్లా... రా రమ్మని పిలువగనే వచ్చెదెట్లా ముందు ఎన్నడు నీ పొందు కోరను...నా దారి నేను పోతానులే... రానులే... చాలులే
పోలేవులే.. నీవు పోలేవులే
చరణం 3 :
అందమైనా ఇలాటి వేళా... అందుకోవే గులాబి మాల కోరికలే మాలికలై నీ మెడలో... వాలెను నేడు ఎన్ని జన్మల ఈ స్నేహబంధమో.. నే నిన్ను వీడి పోలేనులే ఓ ప్రియా..... నా ప్రియా
పోలేవులే.. నీవు పోలేవులే పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను... నా మనసే ఇచ్చాను రావేలా..ఓ ప్రియా... నా ప్రియా... నా ప్రియా
No comments:
Post a Comment