Saturday, September 16, 2017

శ్రీవారు మావారు(1973) - పూలు గుస గుస లాడేనని

తెలుగువారైన జి.కే. వెంకటేష్ గారు కన్నడం లో ఎన్నో చిత్రాలు చేసారు. కానీ తెలుగులో వారు ఎందుకో కొన్నే చిత్రాలు పనిచేసారు. వాటిలో అన్నీ హిట్  మెలోడీస్.
నాకు ఈయన పాటలు, రాజన్ నాగేంద్ర వాళ్ళ పాటల మధ్య కొంచెం సామీప్యం కనిపిస్తుంది

కృష్ణ, వాణిశ్రీ నటించిన 'శ్రీవారు మావారు' (1973) సినిమా లో పాటలు బాగుంటాయి.
వాటిలో 'పూలు గుస గుస లాడెనని' అనే మంచి పాట శ్రీ బాలు గారి స్వరంలో విని ఆనందించండి.







సినిమా ఇక్కడ చూడండి : 


సినిమాశ్రీవారు మావారు (1973)
సంగీతం: జి.కే. వెంకటేష్ 
రచనసినారె
దర్సకత్వంబి.స్. నారాయణ
తారాగణం: కృష్ణ, వాణిశ్రీ, నాగభూషణం, గీతాంజలి
గానం: బాలు

పల్లవి :
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
లాలలలల లాలల... లలలాలలల.. లాలలలల లాలల... లలలాలలల..
చరణం 1 :
మబ్బుకన్నెలు పిలిచేనని..
మనసు రివ్వున ఎగిసేనని..
వయసు సవ్వడి చేసేనని.. ఇపుడే తెలిసిందీ....
రు రు రు రు..ఆ..ఓ 
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... 
చరణం 2 :
అలలు చేతులు సాచేనని..
నురుగు నవ్వులు పూచేనని..
నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!!
రు రు రు రు..ఆ.. ఓ..
పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
టుర్..ఆ ఆ హు...ఆ హు..
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..అది ఈరోజే తెలిసిందీ.. హా.... 

గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా.... 







No comments:

Post a Comment