Wednesday, May 13, 2020

ఆలాపన (1985) - ఆ కనులలో కలల నా చెలి

వంశీ గారి సినిమాలలో, ఫోటోగ్రఫీ తో బాటు సంగీతం, పాటల చిత్రీకరణ విభిన్నంగా ఉంటాయి 
1985 లో వచ్చిన "ఆలాపన" సినిమా లో ఒక సుమధుర గీతం...



చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: మోహన్, భానుప్రియ
దర్శకత్వం: వంశీ




పల్లవి:
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
చరణం 1:
నిదురించు వేళ గస నిస గస నిస గనిదనిమ
హృదయాంచలానా
అలగా పొంగెను నీ భంగిమ గద సని స
అది రూపొందిన స్వర మధురిమ సని దని స
ఆ రాచ నడక రాయంచకెరుక
ఆ రాచ నడక రాయంచకెరుక
ప్రతి అడుగు శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
చరణం 2:
నీ రాకతోనె
ఈ లోయలోనె గస నిస గస నిస గనిదనిమ
అనువులు మెరిసెను మని రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

Monday, May 11, 2020

సరిగమలు (1994) - గోదావరి పై ఎద, కృష్ణమ్మా నీ వాల్జడా

వినీత్, రంభ నటించిన "సరిగమలు" (1994) లో మరో రసవత్తర మైన పాట.. " గోదావరి పై ఎద, కృష్ణమ్మా నీ వాల్జడా" 
వేటూరి గారి కలం నుండి మరో ఆణిముత్యం .




చిత్రం : సరిగమలు (1994)
రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా
    నిండారె తెలుగింటి అందాలె వెలిగించె నండూరి వారెంకిలా
    ఓ ఓ...

    గోదావరి ఎన్నెలా
    నాదారిలో కాయగా
    ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా
    ఓ ఓ...

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా

చరణం 1:
    సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
    బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
    ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్...
    సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
    బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
    ఎన్నెల్లె కోరుకునే ఏకాంతమూ
    నన్నల్లుకోమంది వయ్యారమూ
    కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో నా స్వప్నలోకాలలో
    ఒయ్ ఒయ్ ఒయ్

    గోదావరి ఎన్నెలా
    నాదారిలో కాయగా

చరణం 2:
    గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
    మువ్వమ్మ మురిసేటి మురళీపురం
    ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్...
    గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
    మువ్వమ్మ మురిసేటి మురళీపురం
    ఖవ్వాలే కడవల్లే కదిలే క్షణం
    కడలల్లే పొంగింది నా మానసం
    పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో నా బాహుబంధాలలో

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా
    ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా
    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా

    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ

సరిగమలు (1994) - స్వర రాగ గంగా భవాని

వినీత్, రంభ నటించిన "సరిగమలు" (1994) ఒక మంచి కళాత్మకమైన, సంగీత ప్రధాన  సినిమా. పాటలు బాగుంటాయి.. అందులో ఒకటి "స్వర రాగ గంగా భవాని".





చిత్రం : సరిగమలు (1994)
రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
    ప్రవాహమే... గంగా ప్రవాహమే...
    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక

    స్వరరాగ గంగ ప్రవాహమే..

చరణం 1:
    కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా
    స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన....

    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక...
    స్వరరాగ గంగ ప్రవాహమే..


చరణం 2:
    చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
    పులకింతల పుష్య రాగాలులే
    మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే...

    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక..
    స్వరరాగ గంగ ప్రవాహమే.. స్వరరాగ గంగ ప్రవాహమే..

Friday, May 8, 2020

కెప్టెన్ కృష్ణ (1979) - కల కాలం ఇలా సాగనీ

కృష్ణ, కవిత, నటించిన కెప్టెన్ కృష్ణ సినిమా 1979లో విడుదల అయ్యింది.
ఇది తెలుగు సినీ ప్రపంచం లో మొట్ట మొదటి నీటి లోపల తీసిన సినిమా.


ఇందులో 'కల కాలం ఇలా సాగనీ'  పాట మంచి మెలోడీ. కానీ ఇది వింటుంటే ఎదో హిందీ పాట గుర్తుకు వస్తోంది..


చిత్రం: కెప్టెన్ కృష్ణ (1979)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణంకృష్ణ, శారదా, శ్రీప్రియా, కవిత 


పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 1:

నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివశించనీ...
నీ నయనాలలో నను నివశించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 2:

జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...
నీడల్లె నీ వెంట నేనుండగా...బ్రతుకంత నీతోనే పయణించగా...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 3:

ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము...
ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము..
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...
వెలగాలి కోటి చందమామలై....

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో... నన్నే చూడనీ...

అల్లరి బావ (1980) - మధువని లో రాధికవో

కృష్ణ, జయప్రద నటించిన,1980 లో వచ్చిన "అల్లరి బావ" సినిమాలో "మధువని లో రాధికవో" ఒక మంచి సుమధుర గీతం.. రాజన్-నాగేంద్ర మెలోడీ.





చిత్రంఅల్లరి బావ (1980)
సంగీతంరాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణంకృష్ణ, జయప్రద 
దర్శకత్వం: పి. సాంబశివ రావు 


సినిమా ఇక్కడ చూడండి :



పల్లవి :
మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...


చరణం : 1
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో...


చరణం : 2
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో...