Monday, April 25, 2022

 ఆమె కథ (1977) - పువ్వులనడుగు


చిత్రం: ఆమె కథ  (1977)
సంగీతం: చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: g. ఆనంద్, సుశీల
నటీనటులు:మురళీ మోహన్, జయసుధ, రజినీకాంత్
దర్శకత్వం: రాఘవేంద్రరావు





పల్లవి:

పువ్వులనడుగు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (f) నవ్వులనడుగు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (f) పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు నువ్వంటే….. నాకెంత ప్రేమో ఇది ఏనాటి అనుబంధమో ఓ (m) కొమ్మలనడుగు (f) ఆఁహాఁహాఁహాఁ (m) రెమ్మలనడుగు (f) ఆఁహాఁహాఁహాఁ (m) కొమ్మలనడుగు రెమ్మలనడుగు ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు నువ్వంటే….. నాకెంత ప్రేమో ఇది ఏనాటి అనుబంధమో

చరణం1:

f) పల్లె పదానికి పల్లవినై యీయీ (m) పడుచందానికి పల్లకినై యీయీ (f) పెదవి పల్లవి కలిపేస్తా ఆ..ఆ (m) నా పల్లవి నీలో పలికిస్తా ఆ..అ (f) నీవు నేనుగా పూవు తావిగా జన్మ జన్మలకు విడని జంటగా నీవే నా దీవెనా (m) ఈ పొద్దు చాలక నా ముద్దు తీరగ రేపన్నదే లేక చెలరేగిపోతా 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (f) పువ్వులనడుగు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (f) పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు నువ్వంటే నాకెంత ప్రేమో ఇది ఏనాటి అనుబంధమో

చరణం2:
m) పొడిచే పొద్దుల తూరుపునై యీయీ (f) వాలే పొద్దుల పడమరనై యీయీ (m) దిక్కులు నీలో కలిపేస్తా ఆ..అ (f) నా దిక్కువి నీవని పూజిస్తా ఆ..అ (m) నింగి సాక్షిగా నేల సాక్షిగా మమతల మల్లెల మనస్సాక్షిగా నీవే... నా దేవతా (f) ఆఆ ఆఆ ఆఆ ఆఆఆ వెయ్యేళ్ల కోరిక నూరేళ్లు చాలక ఏడేడు జన్మలు నీదాననౌతా 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (m) కొమ్మలనడుగు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (m) కొమ్మలనడుగు రెమ్మలనడుగు ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు (f) నువ్వంటే (m) నువ్వంటే (f) నాకెంత ప్రేమో (m) ప్రేమో (f) ఇది ఏనాటి అనుబంధమో ఓ

Saturday, December 11, 2021

చూపులు కలసిన శుభవేళ (1988) - నిన్నా మొన్నా నీదే ధ్యానం




చిత్రం: చూపులు కలసిన శుభవేళ (1988)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: మోహన్, అశ్విని
దర్శకత్వం: జంధ్యాల




 పల్లవి:

నిన్నా మొన్నా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై నిమిషం నిమిషం సరసం నింపేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం చరణం1: విరిసివిరియని పరువాలు లయతో తలపడు నాట్యాలు కలహంసలా కదిలావులే మరుహింసకు గురిచేయకే కరుణ చూపించు నా దేవివై తెలిసి తెలియని భావాలు పలికి పలుకని రాగాలు పులకింతలై పలికాయిలే సురగంగలా పొంగాయిలే మళయపవనాల గిలిగింతలో పూచే పొదరిల్లు తోడుగా నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం చరణం2: బ్రతుకే బహుమతి ఇది చాలా మెరిసే అధరం మధుశాల విరజాజిలా విరిసానులే విరహాలలో తడిసానులే ఎదుట నిలిచాను నీదానిగా కలలా కలిసెను ప్రణయాలు కధలై చిలికెను కవనాలు రసరాణిలా వెలిగావులే కవికన్యలా కదిలావులే ప్రణయ రసరాజ్యమేలేములే కాచే వెన్నెల్ల సాక్షిగా నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై నిమిషం నిమిషం సరసం నింపేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం

పంచభూతాలు (1979) - కవ్వించే కలలేవో ఏవో



చిత్రం: పంచభూతాలు (1979)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చంద్రమోహన్, లత
దర్శకత్వం: పి చంద్రశేఖర్ రెడ్డి



పల్లవి

ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..ఆ.ఆ..ఆ..

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా 

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

 ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


చరణం -1

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..

తీయ తీయగా మ్రోయగా పదములాడగా

 సుదతి తనువే.. మదన ధనువై

అదను గని పదును పదును

మరుల విరులు కురియగ


కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


చరణం -2

ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ

 లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.

నవ వికచ కుసుమ ముఖ

ముఖర భ్రమర రుతిలో..ఓఓ..

వనమే వధువై మనువే వరమై

పులకించే ఈ వేళా

 ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..

చల చల్లగా జల్లుగా కవితలల్లగా

ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..

చెలియకై ముత్యాల పందిట

రత్నాల పల్లకి నిలుపగా

 

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

Wednesday, May 13, 2020

ఆలాపన (1985) - ఆ కనులలో కలల నా చెలి

వంశీ గారి సినిమాలలో, ఫోటోగ్రఫీ తో బాటు సంగీతం, పాటల చిత్రీకరణ విభిన్నంగా ఉంటాయి 
1985 లో వచ్చిన "ఆలాపన" సినిమా లో ఒక సుమధుర గీతం...



చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: మోహన్, భానుప్రియ
దర్శకత్వం: వంశీ




పల్లవి:
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
చరణం 1:
నిదురించు వేళ గస నిస గస నిస గనిదనిమ
హృదయాంచలానా
అలగా పొంగెను నీ భంగిమ గద సని స
అది రూపొందిన స్వర మధురిమ సని దని స
ఆ రాచ నడక రాయంచకెరుక
ఆ రాచ నడక రాయంచకెరుక
ప్రతి అడుగు శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
చరణం 2:
నీ రాకతోనె
ఈ లోయలోనె గస నిస గస నిస గనిదనిమ
అనువులు మెరిసెను మని రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

Monday, May 11, 2020

సరిగమలు (1994) - గోదావరి పై ఎద, కృష్ణమ్మా నీ వాల్జడా

వినీత్, రంభ నటించిన "సరిగమలు" (1994) లో మరో రసవత్తర మైన పాట.. " గోదావరి పై ఎద, కృష్ణమ్మా నీ వాల్జడా" 
వేటూరి గారి కలం నుండి మరో ఆణిముత్యం .




చిత్రం : సరిగమలు (1994)
రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా
    నిండారె తెలుగింటి అందాలె వెలిగించె నండూరి వారెంకిలా
    ఓ ఓ...

    గోదావరి ఎన్నెలా
    నాదారిలో కాయగా
    ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా
    ఓ ఓ...

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా

చరణం 1:
    సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
    బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
    ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్...
    సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
    బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
    ఎన్నెల్లె కోరుకునే ఏకాంతమూ
    నన్నల్లుకోమంది వయ్యారమూ
    కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో నా స్వప్నలోకాలలో
    ఒయ్ ఒయ్ ఒయ్

    గోదావరి ఎన్నెలా
    నాదారిలో కాయగా

చరణం 2:
    గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
    మువ్వమ్మ మురిసేటి మురళీపురం
    ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్...
    గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
    మువ్వమ్మ మురిసేటి మురళీపురం
    ఖవ్వాలే కడవల్లే కదిలే క్షణం
    కడలల్లే పొంగింది నా మానసం
    పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో నా బాహుబంధాలలో

    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా
    ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా
    గోదావరీ పయ్యెదా
    కృష్ణమ్మ నీ వాల్జెడా

    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
    చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ

సరిగమలు (1994) - స్వర రాగ గంగా భవాని

వినీత్, రంభ నటించిన "సరిగమలు" (1994) ఒక మంచి కళాత్మకమైన, సంగీత ప్రధాన  సినిమా. పాటలు బాగుంటాయి.. అందులో ఒకటి "స్వర రాగ గంగా భవాని".





చిత్రం : సరిగమలు (1994)
రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
    ప్రవాహమే... గంగా ప్రవాహమే...
    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక

    స్వరరాగ గంగ ప్రవాహమే..

చరణం 1:
    కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా
    స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన....

    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక...
    స్వరరాగ గంగ ప్రవాహమే..


చరణం 2:
    చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
    పులకింతల పుష్య రాగాలులే
    మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే...

    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక..
    స్వరరాగ గంగ ప్రవాహమే.. స్వరరాగ గంగ ప్రవాహమే..

Friday, May 8, 2020

కెప్టెన్ కృష్ణ (1979) - కల కాలం ఇలా సాగనీ

కృష్ణ, కవిత, నటించిన కెప్టెన్ కృష్ణ సినిమా 1979లో విడుదల అయ్యింది.
ఇది తెలుగు సినీ ప్రపంచం లో మొట్ట మొదటి నీటి లోపల తీసిన సినిమా.


ఇందులో 'కల కాలం ఇలా సాగనీ'  పాట మంచి మెలోడీ. కానీ ఇది వింటుంటే ఎదో హిందీ పాట గుర్తుకు వస్తోంది..


చిత్రం: కెప్టెన్ కృష్ణ (1979)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
తారాగణంకృష్ణ, శారదా, శ్రీప్రియా, కవిత 


పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 1:

నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివశించనీ...
నీ నయనాలలో నను నివశించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 2:

జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...
నీడల్లె నీ వెంట నేనుండగా...బ్రతుకంత నీతోనే పయణించగా...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

చరణం 3:

ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము...
ఈ జంటకు తొలిపంట ఈ రూపము...నా కంటికి వెలుగైన చిరుదీపము..
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...
వెలగాలి కోటి చందమామలై....

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో... నన్నే చూడనీ...