Saturday, December 11, 2021

పంచభూతాలు (1979) - కవ్వించే కలలేవో ఏవో



చిత్రం: పంచభూతాలు (1979)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చంద్రమోహన్, లత
దర్శకత్వం: పి చంద్రశేఖర్ రెడ్డి



పల్లవి

ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..ఆ.ఆ..ఆ..

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా 

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

 ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


చరణం -1

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..

తీయ తీయగా మ్రోయగా పదములాడగా

 సుదతి తనువే.. మదన ధనువై

అదను గని పదును పదును

మరుల విరులు కురియగ


కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ


చరణం -2

ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ

 లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.

నవ వికచ కుసుమ ముఖ

ముఖర భ్రమర రుతిలో..ఓఓ..

వనమే వధువై మనువే వరమై

పులకించే ఈ వేళా

 ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..

చల చల్లగా జల్లుగా కవితలల్లగా

ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..

చెలియకై ముత్యాల పందిట

రత్నాల పల్లకి నిలుపగా

 

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలికల ఊగెనులే

తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో

ఏవో ఏవో కదలాడే ఈవేళా

No comments:

Post a Comment