పల్లవి:
నిన్నా మొన్నా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై నిమిషం నిమిషం సరసం నింపేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం చరణం1: విరిసివిరియని పరువాలు లయతో తలపడు నాట్యాలు కలహంసలా కదిలావులే మరుహింసకు గురిచేయకే కరుణ చూపించు నా దేవివై తెలిసి తెలియని భావాలు పలికి పలుకని రాగాలు పులకింతలై పలికాయిలే సురగంగలా పొంగాయిలే మళయపవనాల గిలిగింతలో పూచే పొదరిల్లు తోడుగా నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం చరణం2: బ్రతుకే బహుమతి ఇది చాలా మెరిసే అధరం మధుశాల విరజాజిలా విరిసానులే విరహాలలో తడిసానులే ఎదుట నిలిచాను నీదానిగా కలలా కలిసెను ప్రణయాలు కధలై చిలికెను కవనాలు రసరాణిలా వెలిగావులే కవికన్యలా కదిలావులే ప్రణయ రసరాజ్యమేలేములే కాచే వెన్నెల్ల సాక్షిగా నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానం రాగం తానం నీవు నేనై సంగీతాలే సంయోగాలై నిమిషం నిమిషం సరసం నింపేను ఈ నిన్నా మొనా నీదే ధ్యానం నేడు రేపు నీవే గానంనాకు తెల్సినవి, అందరితో పంచుకోవాలని.. సర్వే జన శుఖినోభవంతు
Saturday, December 11, 2021
చూపులు కలసిన శుభవేళ (1988) - నిన్నా మొన్నా నీదే ధ్యానం
పంచభూతాలు (1979) - కవ్వించే కలలేవో ఏవో
పల్లవి
ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..ఆ.ఆ..ఆ..
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
చరణం -1
అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును
మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
చరణం -2
ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ
లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.
నవ వికచ కుసుమ ముఖ
ముఖర భ్రమర రుతిలో..ఓఓ..
వనమే వధువై మనువే వరమై
పులకించే ఈ వేళా
ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..
చల చల్లగా జల్లుగా కవితలల్లగా
ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట
రత్నాల పల్లకి నిలుపగా
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
