Friday, October 28, 2016

అమ్మాయిల శపథం - నీలి మేఘమా


శ్రీమతి వాణి జయరాం పాటలంటే నాకు చాలా ఇష్టం.
1975 లో విడుదల అయ్యిన "అమ్మాయిల శపథం" చిత్రం లో బాలు, వాణి జయరాం పాడిన -
"నీలి మేఘమా" పాట ఎంతో చాలా బాగుంటుంది.
ఈ సినిమా గురించి ఎంతో వెదికినా దొరకలేదు..
74-75లో వచ్చిన మంచి పాటల్లో... ఇది ఒకటి..



మీరు విని ఆనందించండి:


సినిమా: అమ్మాయిల శపథం (1975)
సంగీతం: విజయ భాస్కర్
రచన: ఆత్రేయ
దర్సకత్వం: జి. వి. ఆర్. శేషగిరి రావు
తారాగణం: రామకృష్ణ, చంద్ర మోహన్, లక్ష్మి,చంద్రకళ

ఈ చిత్రం లోని మిగత పాటలు ఇక్కడ వినండి: అమ్మాయిల శపథం


పల్లవి: 
నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా 
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా 

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా 

చరణం 1: 
ఆనుకోని రాగాలు వినిపించేనే 
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే 
ఆనుకోని రాగాలు వినిపించేనే 
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే 

కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా 
రా.. జాబిలి నా నెచ్చలి.. జాగేల... ఈ వేళ.. నను చేరగా 

నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముషమాగుమా 
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ 

చరణం 2: 
కళ్యాణ మేళాలు మ్రోగించనా 
కంఠాన సూత్రాన్ని ముడివేయనా 
కళ్యాణ మేళాలు మ్రోగించనా.. 
కంఠాన సూత్రాన్ని ముడివేయనా.. 

గుండె గుడిగా చేయనా.. నిన్ను కొలువు తీర్చనా 
నీ దాసినై... సావాసినై... నా ప్రేమ పుష్పాల పూజించనా... 

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా 
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా.... 





ఆ పాత(ట) మధురాలు

నా చినప్పుడు రేడియో లో ఒక కార్యక్రమం వచ్చేది - 'Bhoole Bhikre Geet' అని..
అక్కడ మనం కని వినీ ఎరగని కొన్ని హిందీ పాటలు ప్రసారం చేసే వాళ్ళు..
అలానే తెలుగు లో ఉంటే బాగుంటుంది అనిపించి.. తెలుగు లో అంతగా ప్రాచుర్యం పొందినా తెర మరుగైనా శ్రావ్యమైన పాటల్ని ఇలా ఇక్కడ అందిస్తున్నా...విని ఆనందించండి...ఆదరించండి..
అలానే మీ అభిప్రాయాలని క్రింది కామెంట్స్ లో తెలపండి

ఉపోద్ఘాతము

నా పేరు మోహనకృష్ణ. మాది కాకినాడ..
ఎవరో చెప్పినట్టు.. "మాది కాకినాడ, మేము ఇలాగె ఉంటాం, మేము మాలానే ఉంటాం"

నాకు తెలుగు అన్నా, తెలుగు లో మాట్లాడడం అన్నా మిక్కిలి ప్రీతి.
తెలుగు వాళ్ళమై ఉండి కూడా మనం తెలుగు లో మాట్లడుకోము..
మనం మాట్లాడే తెలుగులో తెలుగు లెస్స....

అందుకే తెలుగులో బ్లాగు రాద్దామని ఎన్నాళ్ళనుండో అనుకుంటూ అనుకుంటూ ఉన్నా., ఇప్పటికి కార్య రూపం దాల్చింది.
నాకు తెల్సిన, నాకు వస్తున్న, వఛ్చిన ఆలోచనలని ఇక్కడ ఆవిష్కరిస్తున్నా.
చూసి, చూపించి ,చదివి,ఫార్వర్డ్ చేసి ఆదరిస్తారని తలుస్తున్నాను ....

తప్పులు ఉన్నా తెలుపగలరు..సవరించుకుంటాను