Wednesday, August 30, 2017

జేగంటలు(1981) - వందనాలు వందనాలు

1981 లో వచ్చిన"జేగంటలు" సినిమాలో మంచి పాటలున్నాయి..
దానిలో "వందనాలు వందనాలు" పాట.. మంచి మెలోడీ..
ఒక శృంగార గీతాన్ని ఎంత రమ్యంగ తీయొచ్చొ ఈ పాటని చూస్తే దర్శకుడు శ్రీ సింగీతం కి జోహార్లు అర్పించాక మానం.
కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమా మంచి హిట్ .. రాంజీ,ముచ్చెర్ల అరుణ కి ఇది మొదటి సినిమా.



మీరు విని ఆనందించండి:


చిత్రం: జేగంటలు (1981)
సంగీతంకే.వి.మహదేవన్ 
గీతరచయిత:  వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పేదరాశి పెద్దమ్మ కథ(1968) - ఓ జవరాల..ఓ ప్రియురాలా


1968 పేదరాశి పెద్దమ్మ కథ లో నుండి ఒక మంచి పాట.. "ఓ జవరాల..ఓ ప్రియురాలా"
శ్రీ విజయరత్నం గారు రాసిందే .. 
ఈ పాట రామకృష్ణ, విజయలలిత ల మీద చిత్రీకరింపబడింది





మీరు విని ఆనందించండి:


సినిమా ఇక్కడ చూడండి :


చిత్రం: పేదరాశి పెద్దమ్మ కథ (1968)
సంగీతం: S.P. కోదండపాణి
గీతరచయితవిజయ రత్నం
నేపధ్య గానం: బాలు, జానకి


విజయరత్నం పాటలు

విజయరత్నం పాటలన్ని ఇక్కడ విన్నండి :

పాటలు

కథానాయకురాలు(1970) - తానువా హరిచందనమే

'కథానాయకురాలు' సినిమా లో ఒక మంచి పాట.
"తానువా హరిచందనమే.. పలుకా అది మకరందమే"
శ్రీమతి సుశీల, బాలు ఆలపించిన ఒక హాయైన గీతం...
ఈ గీత రచయితా గురించి మొన్న ఈటీవీ 'స్వరాభిషేకం" లో పరిచయం చేసారు.
ఆయనే "విజయరత్నం"..రాసినవి కొన్ని పాటలైనా మంచి సాహిత్యపు విలువలున్న పాటలు రాసారు.



మీరు విని ఆనందించండి:


సినిమా ఇక్కడ చూడండి : కథానాయకురాలు

చిత్రం: కథానాయకురాలు (1970)
సంగీతంఆకుల అప్పల రాజ్
గీతరచయితవిజయ రత్నం
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

తనువ.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే

తనువా... ఉహు.. హరిచందనమే..
పలుకా.. ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా హరిచందనమే..

చరణం 1:

నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే
ఉహు .. హు .. ఓహో
నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే

హరివిల్లునై ఈ విరి బాణమే
హరివిల్లునై ఈ విరి బాణమే
గురి చూసి హృదయాన విసిరేయనా.. నిను చేరనా.. మురిపించనా..

తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

చరణం 2:

నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే...
ఆ...ఆ...ఆ...
నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే
మధుపాయినై మరులూరించనా
మధుపాయినై మరులూరించనా
ఉయ్యాల జంపాల ఊగించనా.. లాలించనా.. పాలించనా

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను